Monday, December 8, 2008

రోడ్ షో ల కు షో చెప్పిన కోర్టు

రాష్ట్రం లో వివిధ రాజకీయ పార్టీ లు నిర్వహిస్తున్న రోడ్ షో తో ప్రజలకు ఇబ్బంది గా ఉందని భావించిన హై కోర్టు వీటిని తాత్కాలికం గా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పై రోడ్ షోలు నిర్వహించడానికి ఎవరికీ అనుమతులు ఉండవని స్పష్టం చేసింది.

ఇటీవల ప్రజారాజ్యం నిర్వహించిన కొన్ని రోడ్ షో లో తొక్కిసలాట ఏర్పడి ప్రజలు మృతి చెందటం తో ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై హై కోర్టు విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దారిలో ప్రయాణించవలసిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అభిప్రాయ్ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టు కు విన్నవించుంది. ఉత్తర్వు పై ప్రజారాజ్యం తరఫు న్యాయవాది అభ్యంతరం చేయగా కోర్టు తోసి పుచ్చింది.

కోర్టు ఉత్తర్వుల తో అన్ని పార్టీలకు దెబ్బ పడినా ప్రధానం గా ఇప్పుడు ప్రజా అంకిత యాత్ర జరుపుతున్న ప్రజారాజ్యం పార్టీ కి, తెలంగాణ జైత్రయాత్ర జరుపుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి కి వెంటనే ప్రభావం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా లో తెలంగాణ జైత్రయాత్ర జరుపుతున్న కేసీఆర్ తన తదుపరి పర్యటన ను బహిరంగ సభలు గా మార్చారు
.

ఇటీవల ముఖ్యమంత్రి విశాఖ, ఒంగోలు జిల్లాలలో పీసీసీ చీఫ్ డిఎస్ వరంగల్ లో రోడ్ షో లు నిర్వహించారు. ముఖ్యంగా బాలకృష్ణ, ఎన్టీఆర్ తో నెల 30 నుంచి తెలుగు దేశం పార్టీ రోడ్ షోలను నిర్వహించాలని నిర్ణయించింది.

కోర్టు ఉత్తర్వుల తో అన్ని పార్టీ లకు నిరాశ ఎదురవుతుంది. కానీ ప్రజల కోసమే అని చెప్పుకునే రాజకీయ పార్టీ లు ఉత్తర్వు ద్వారా మేలు చేకూరుతుంది అంటే సంతోషించాలి.

No comments: